Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
మండలంలో ఆర్ఎంపీలు అర్హత కలిగిన వారు మాత్రమే వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ కోటాచలం అన్నారు.సోమవారం మండల కేంద్రంలో ఒక ప్రాథమిక చికిత్సాకేంద్రాన్ని మూసివేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీలు తమ స్థాయి మించి వైద్య సేవలు అందించరాదన్నారు. చిలుకూరు మండల కేంద్రంలో ఒక బాలిక మృతి చెందిన సంఘటన తమ వెలుగులోకి వచ్చింది అన్నారు ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులను విచారణ చేశామన్నారు.వారు తమకు లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ వో నిరంజన్ జిల్లా వైద్య అధికారులు వెంకటరమణ కళ్యాణ్ చక్రవర్తి తేజస్విని వినోదు చిలుకలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.