Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యలను పరిష్కారానికి చొరవ తీసుకోని,బదిలీలు,పదోన్నతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కస్తూరి కిషన్‌ప్రసాద్,ప్రధాన కార్యదర్శి మామిడి అరవింద్, జిల్లా సహాధ్యక్షులు నక్కపోతు శ్రీనయ్య కోరారు.తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు కోరేది ఉపాధ్యాయుల కోసం కాదన్నారు.పాఠశాలల నిర్వహణ మెరుగుదలకు,అందులో చదివే విద్యార్థుల బాగు కోసమేనని తెలిపారు.317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని,కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు పరచి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ కోసం వెంటనే సర్వీస్ పర్సన్స్ నియామకానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.పాఠశాలల్లో ప్రత్యక్ష నియామకాలు జరిగేలోగా విద్యాబోధనకు ఆటంకం కలుగకుండా అవసరమైన చోట విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు.ఈ సందర్భంగా మంత్రి స్పదించి సమస్యల తీవ్రతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం ప్రాతినిధ్యం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.