Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ జాతీయ రాజకీయ అరంగేట్రానికి భయపడే హడావిడి నోటిఫికేషన్
- మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఏనాడో ఖాయమైంది
- బీజేపీకి మూడోస్థానం
- విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
మునుగోడు ఉపఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, ప్రజలు అంతకంటే ఎక్కువగా సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పై వస్తున్న సంకేతాలకు భయపడే హడావిడ గా నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు.అసలు ఏనాడో ఎన్నికల నోటఫికేషన్ రావాల్సి ఉన్నప్పటికీ ఓటమికి భయపడే ఆలస్యం చేశారన్నారు.టీఆర్ఎస్ విజయం ఖాయమని జోస్యంచెప్పారు.తాము ఒడిపోతామని మోడీ , అమిత్‌షాలకు తెలుసన్నారు.మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టిన, అమిత్‌షా, నడ్డాలు మునుగోడుకు వచ్చి కూర్చున్నా టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరన్నారు.కోవర్టును కొనుక్కుని తద్వారా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని మునుగోడు ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.రైతాంగాన్ని ముంచుతూ నిత్యావసర ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెట్టీ, పేద మధ్య తరగతి ప్రజల పొట్ట గొడుతున్న దుష్ట బీజేపీని బొందపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్ పాల్గొన్నారు.