Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
తాడ్వాయి-గురప్పవాగుపై బిడ్జిని ర్మాణం చేయాలని కోరుతూ ఆగ్రామ ప్ర జలు సోమవారం వాగు వద్ద ఆందోళన నిర్వహించారు.రెండు రోజుల కింద వాగులో పడి మృతి చెందిన సైదులు మృతదేహనికి పోలీసులు పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా ప్రజలు అడ్డుతగి లారు.పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.మృతుడిది పేద కుటుంబమని,ఇద్దరు కూతుళ్లు ఉన్నారని గుర్తు చేశారు.పెట్రోల్ బంక్‌లో ఆపరేటర్‌గా పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపారు.వాగుపై వంతెన నిర్మించాలని ఆరేడు దశాబ్దాలుగా మొత్తుకుంటున్నా పట్టించుకునే దిక్కేలేదన్నారు. వరదలు వచ్చే సమయంలో వాగు దాటలే క ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నామని ప్రజలు పోలీసుల దృష్టికి తెచ్చారు.వాగుపై బిడ్జి నిర్మాణం చేస్తామని ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళ విరమించేది లేదని భీష్మించు కూర్చున్నారు.గురప్పవాగుతో పాటు గణపవరం వాగుపైన కూడా వంతెనలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.పరిస్థితి మరింతగా విషమించడంతో మునగాల సీఐ ఆంజనేయులు కోదాడ ఆర్డీవో కిశోర్ బాబుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.ఆందోళనాకారులతో ఆర్డీవో ఫో న్లో మాట్లాడి నచ్చజెప్పారు.మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాతో పాటు వాగుపై బిడ్జి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.