Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరు టౌన్
పట్టణ కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్లో మహనీయుల విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని బిసి సంఘర్షణ సమితి ఉమ్మడి నల్లగొండ జిల్లా కో కన్వీనర్ తోట బాలరాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు ఇటీవల మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. విగ్రహ ఆవిష్కరణకు నిర్వాహకులు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించక పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ మలిదశ ఉద్యమంలో ముందుండి పనిచేశారన్నారు సబ్బండ వర్గాలకు చెందిన జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం సభ్యులు ఆంజనేయులు ,రాంబాబు, మల్లేష్ పాల్గొన్నారు.