Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండవ శనివారం, ఆదివారం నామినేషన్ల స్వీకరణ ఉండదు
- జిల్లా కలెక్టర్ టీ వినయ్ య్ష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మునుగోడు నియోజక వర్గం ఉప ఎన్నికకు సాఫీగా నిర్వహణకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణ పై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం అక్టోబర్ 3 న ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసినందున అదే రోజు నుండి నల్గొండ,యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మోడల్ కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై ఎటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రాతలు చెరిపి వేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఎం.సి.సి. 16 టీమ్లు ఏర్పాటు చేసినట్లు, సభలు సమావేశాలు వీడియోగ్రఫీకి విఎస్టీ7 టీమ్లు, డబ్బు, మద్యం పంపిణీ అరికట్టేందుకు వాహనాల తనిఖీకి ఎఫ్ఎస్టి (ఫ్లయింగ్ స్క్వాడ్) 14 టీమ్లు, ఎస్ఎస్టి18 టీమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహాలు, వాహనాలు ఎన్నికల ప్రచారానికి వాడకూడదని అన్నారు. అక్టోబర్ 7న గెజిట్ నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ 7 నుండి నామినేషన్ లు స్వీకరణ చేయనున్నట్లు,14 అక్టోబర్ వరకు నామినేషన్ లు దాఖలు చేయుటకు చివరి తేదీ అని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారని తెలిపారు. అక్టోబర్ 15 న నామినేషన్ ల పరిశీలన, అక్టోబర్ 17 న నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ అని కలెక్టర్ తెలిపారు. రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాల్లో నామినేషన్ లు స్వీకరణ వుండదన్నారు. నామినేషన్ పత్రాలను చండూర్ తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారని తెలిపారు. పోలింగ్ నవంబర్ 3 వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నవంబర్ 6 న ఎన్నికల కౌంటింగ్ వుంటుందని తెలిపారు. నవంబర్ 8 లోగా ఎన్నికల ప్రక్రియ ముగింపు వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో వుంటుందని ఆయన తెలిపారు. సింగిల్ విండో పద్ధతిన చండూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 48 గంటల ముందు దరఖాస్తు చేస్తే 48 గంటల లోపల ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిన అనుమతులు జారీ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థి గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి 40 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు.ఈ సమావేశం లో ఎన్నికల ప్రచార సామగ్రి ఖర్చులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం లో ఖరారు చేయడం జరిగింది.ఈ సమావేశం లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్ రావు, నల్గొండ అర్.డి.ఓ జయచంద్రారెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, టీఆర్ఎస్ తరపున పిచ్చయ్య, సీపీఐ (ఎం) నుండి నర్సిరెడ్డి, ఎంఐఎం నుండి రజియుద్దీన్, బీజేపీ నుండి పి.లింగస్వామి, కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి, ఎన్నికల డి.టి. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.