Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ఆలేరు టౌన్
దేశవ్యాప్తంగా వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కొరకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు . బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ,దసరా పర్వదినం పండగ వేడుకల్లో భాగంగా అలాయ్ బలాయ్ కొరకు నియోజకవర్గకేంద్రం నుండి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లోని సునీత నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల పక్షాన నిలిచి బీజేపీని ఎదుర్కొనే శక్తి కేవలం టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ గడ్డమిది రవీందర్ ,వైస్ చైర్మన్ గేదె పాక నాగరాజు,ఆర్టీఏ సభ్యులు పంతం కృష్ణ , ఆలేరు మున్సిఫల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, మాజీ ఎంపీపీ కాసగళ్ల అనసూర్య , గిరి, బిజన బాలరాజు, అంజన్ కుమార్ , కార్యకర్తలు పాల్గొన్నారు.