Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
ఓ విశ్రాంత కానిస్టేబుల్ ఇంట్లో చోరీ జరిగిన సంఘటన గురువారం కొండమల్లేపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడు కేతావత్ లష్కర్ తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ రోడ్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. దసరా పండుగ సందర్భంగా ఇంటికి తాళాలు వేసి తన సొంత ఊరు దేవరచర్లకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లగా తిరిగి గురువారం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు ధ్వంసం చేసి ఇంట్లో వస్తువులను చిందరవందర ఉన్నాయి. ఇంట్లో ఉన్న 20,000 నగదు, నాలుగు బస్తాల బియ్యం, ఓ బైకు దుండగులు వెతుకు వెళ్ళినట్టు గమనించాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.