Authorization
Sat March 22, 2025 03:51:18 am
నవతెలంగాణ అర్వపల్లి
హెల్త్ క్యాంప్ ద్వారా గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించడం సంతోషకరమని మండల ఎంపీపీ మనె రేణుక లక్ష్మినర్సు యయాదవ్ అన్నారు.గురువారం మండల కేంద్రంలో హైదరాబాద్ ఎల్బీనగర్ ఆరంజ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వల్లాల రమేష్ యాదవ్ ,వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.