Authorization
Fri March 21, 2025 05:14:19 am
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షానికి గ్రామానికి చెందిన రైతు మామిడాల అంజయ్య నాలుగు ఎకరాలు వరి పైరు మొత్తం నేలమట్టమయ్యింది. నోటి కాడికి వచ్చిన పంట నేలమట్టం కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఉప్పొంగిన బిక్కేరు వాగు
ఆలేరు మండలం గొలనుకొండ, కొలనుపాక, మంతపురి గ్రామాలలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి బిక్కేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఆలేరు పట్టణానికి వెళ్లాలంటే ఈ రహదారుల వెంబడే పోవాల్సిన పరిస్థితి ఉంది వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బాట సారులు వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ వాగులు దాటవలసిన పరిస్థితి వచ్చింది ఐదు గంటలపాటు ప్రజా ప్రతినిధులు అధికారులు వాగు వెంబడి ఉండి ప్రయాణికులను పోనీయకుండా చూసుకున్నారు.