Authorization
Thu March 20, 2025 03:38:24 am
నవతెలంగాణ -తుంగతుర్తి
సమాజంలో సామరస్యతను పెంపొందించేందుకు కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అందరూ భాగస్వాములు కావాలని ఎన్ఎస్యుఐ నియోజకవర్గ ఇన్చార్జి కొండ నాగరాజు కోరారు. గురువారం నియోజకవర్గం నుంచి ఎన్ఎన్యు ఐ నాయకులు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో జోడోయాత్రలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు సామరస్యతను పెంపొందించేందుకు చేపట్టిన ఈ యాత్రలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారని అన్నారు.యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, దేశం అభివృద్ధి పథంలో నడవాలన్న, రాహుల్ గాంధీ ప్రధాని కావడంతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు.