Authorization
Sun March 09, 2025 01:14:18 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చండూర్
ఈ నెల 30న చండూరులో నిర్వహించే బహిరంగ సభలో బీజేపీ అరాచక పాలనను ఎండగడతాం అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బంగారుగడ్డ గ్రామ శివారులో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాంగణ వివరాలు, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సభకు లక్ష మంది ప్రజలు హాజరవుతున్నారన్నారు. సభను విజయవంతం చేయడానికి పార్టీ నేతలు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గులాబీ జెండా ఎగరేయడం ఖాయమన్నారు. అసలు దొంగల ఆడియో టేబుల్ బయటపడ్డాక బండి సంజరు యాదగిరిగుట్టలో ఏమని ప్రమాణం చేస్తాడన్నారు. దొంగలు శిక్షణ అనుభవించి తీరుతారని చెప్పారు. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫై ఉన్నారని, టీఆర్ఎస్ను గెలిపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారుగడ్డ సర్పంచ్ పల్లే వెంకటయ్య, పార్టీ నేతలు పాల్గొన్నారు.