Authorization
Fri March 21, 2025 04:23:47 am
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆటోలతో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వలిగొండ ఎక్స్ రోడ్డు వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంబాబుయాదవ్, మారయ్య, నారాయణ, వెంకటేశ్, ఇమ్రాన్, ఎమ్‌డి.పాషా, శంకర్, మాధవరెడ్డి, కృష్ణపాల్గొన్నారు.