Authorization
Tue March 18, 2025 08:50:29 pm
నవతెలంగాణ-మర్రిగూడ
అనునిత్యం పేద ప్రజల కోసం తపన పడుతున్న పార్టీ టీఆర్ఎస్ అని, పేద ప్రజలకు అండగా ఉండేది గులాబీ జెండా అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మర్రిగూడ మండలం ఎర్రగండ్లపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. మునుగోడు అభివృద్ధి జరగాలంటే కూసుకుంట్లతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ దంటు జగదీశ్వర్, సర్పంచ్ శాంతమ్మ వెంకటయ్య, గ్రామశాఖ అధ్యక్షులు ముద్దం శ్రీను, ఎంపీటీసీ దంటు జ్యోతి జగదీశ్వర్ పాల్గొన్నారు.