Authorization
Fri March 21, 2025 11:09:07 pm
నవతెలంగాణ-మునగాల
కార్మిక హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ అలుపెరగని ఉద్యమాలు నిర్వహించిందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్ అన్నారు.సోమవారం మండలకేంద్రంలో ఏఐటీయూసీ 102వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్, ఏఐటీయూసీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే.లతీఫ్. మండల అధ్యక్ష కార్యదర్శులు జక్కుల గురుమూర్తి, రాఘవరెడ్డి,జక్కుల వీరశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు మల్సూర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి.శివ, మిల్లు డ్రైవర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసరెడ్డి, రాంరెడ్డి,నర్సిరెడ్డి,ఎలక్ట్రీషియన్ వర్కర్స్ నాయకులు మహేష్, కర్నాకర్, సైదులు పాల్గొన్నారు.