Authorization
Thu March 20, 2025 07:58:18 am
- ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వాహకులకు అవగాహనా సదస్సు
నవతెలంగాణ-చివ్వెంల
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తహసీల్దార్ రంగారావు అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో మండల సమాఖ్య కార్యాలయంలో తహసీల్దార్ రంగారావు అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు.అనంతరం తహసీల్దార్ రంగారావు మాట్లాడుతూ 17శాతం తేమ శాతం ఉన్న ధాన్యాన్ని రైతులు సెంటర్ కు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలిపారు. వ్యవసాయ అధికారి ధ్రువీకరణ తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేకపోతే మిల్లు వారు తరుగు పేరుతో ఇబ్బందులు పెడతారన్నారు.మిల్లుకు వెళ్ళగానే ట్రక్కు షీట్స్ తెప్పించి బిల్లులు పెట్టి ఇబ్బందికలగకుండా పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయఅధికారి ఆశాకుమారి, ఏపీఎం రాంబాబు, సీఈఓ శ్యాంసుందర్‌రెడ్డి, ఏ ఈఓలు, సీసీలు, సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.