Authorization
Sun March 09, 2025 01:02:18 am
నవతెలంగాణ-పాలకవీడు
భారత్ జూడోయాత్రలో భాగంగా రాహుల్‌గాంధీని మంగళవారం ఎంపీటీసీల ఫోరం మండలఅధ్యక్షుడు మీసాల ఉపేందర్ కలిశారు.వికలాంగుల జేఏసీ రాష్ట్ర చైర్మెన్ ముత్తినేని వీరయ్య అధ్వర్యంలో ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో పాల్గొని వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు.రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు పంపిణీ చేసిన మోటార్‌సైకిళ్ళు, మెమోంటోను బహూకరించారు.దేశంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. స్పందించిన రాహుల్‌గాంధీ వికలాంగులకు ఉపాధిహామీలో 150 పనిదినాలు కల్పించాలని, వికలాంగుల వాహనాలపై జీఎస్టీని ఎత్తివేయడంతో పాటు పలు సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు.పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తామని,తాము అధికారంలోకి వస్తే వికలాంగులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.