Authorization
Tue March 18, 2025 05:59:47 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
అమరుల ఆశయసాధనకై పోరాడు దామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని లాల్ బంగ్లాలో ఆ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పార్టీ పిలుపుమేరకు అమరవీరులకు నివాళులర్పించి మాట్లాడారు.ఈ కార్యక్ర మంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఉదయగిరి, వి.నర్సింహారావు, చంద్రారావు, వీసాల వెంకటేశ్వర్లు, పారెల్లి నాగయ్య, మిరియాల శ్రీను, రాజు, ఆదూరి శ్రీను, వెంకన్న, వెంకటేశ్వర్లు, డి.సైదా తదితరులు పాల్గొన్నారు.