Authorization
Thu March 20, 2025 07:58:18 am
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని శోభనాద్రిపురం గ్రామానికి చెందిన ఆనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముక్కముల శ్రీకాంత్ కు అత్యవసర వైద్యం నిమిత్తం 2లక్షల 50వేల రూపాయల, రామన్న పేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన చిల్ల వెంకటయ్య 2 లక్షల రూపాయల ఎల్ వో సి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ కన్నెబోయిన జోతి, ఉపసర్పంచ్ ముక్కాముల నరెందర్, కక్కిరేణి గ్రామ శాఖ అధ్యక్షులు గుండు రమేష్, బాషాబోయిన బిక్షం పాల్గొన్నారు.