Authorization
Thu March 20, 2025 12:18:19 am
నవతెలంగాణ-మిర్యాలగూడ
గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు దనవత్ సిద్దునాయక్ డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడ ఆర్డివో కార్యాలయం ఎదుట ప్లకార్డ్‌లు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లవుతున్న పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో అబద్దపు మాటలు చెప్పి లంబాడీల ఓట్లను దందుకోవడం అలవాటుగా మారిందన్నారు. ఎన్నికల ముందు దరఖాస్తులు స్వీకరించిన నాయకులు ముఖం చాటేశారని, తక్షణమే పట్టాలు మంజూరు చేయకపొతే ఉద్యమాలు చేపడుతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దనవత్ చందు, శివ, పవన్, సంతోష్, మధు, లిట్టునాయక్ పాల్గొన్నారు.