Authorization
Fri March 21, 2025 12:14:13 am
నవతెలంగాణ- ఆలేరు టౌన్
ఈ నెల 13న మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నిర్వహించనున్న వ్యవసాయ కార్మిక సంఘం మండల , పట్టణ మహసభలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌలు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహాసభలకు ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు రోజువారి కూలీ రూ.600 ఇవ్వాలని, ప్రభుత్వ జీవో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల ఉపాధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ , గాదె చంద్రం, గ్యార భాస్కర్ ,సుధాకర్ రెడ్డి ,గ్యార స్వాతి' లక్ష్మి ,మరియమ్మ ,ఎస్తేరా ,గ్యారండాలు ,బుచ్చమ్మ, చంద్రమ్మ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి జూకంటి పౌల్ అన్నారు.సోమవారం మండలం లోని కంది గడ్డ తండా గ్రామంలో కేతావత్తు లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు ఉపాధి కూలీలకు సరైన పని కూడా చూపించడం లేదన్నారు . రోజుకు రూ.600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గ్రామ కమిటీ ఎన్నుకున్నారు .ఈ కార్యక్రమంలో కమలమ్మ, లలిత ,బుజ్జి ,మధు తదితరులు పాల్గొన్నారు.