Authorization
Wed March 19, 2025 12:06:47 pm
నవతెలంగాణ-పెద్దవూర
గిరిజన పేద రైతులు సేద్యం చేసుకుంటున్న జొన్న పంటలపై విషప్రయోగం చేసి పాడుచేసిన శాగం ఈశ్వరమ్మ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఈనెల 4వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో గిరిజన రైతులు పిర్యాదుచేసి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన విషయం విధితమే.కాగా మండలంలోని కుంకుడుచెట్టుగ్రామ శివారులో సర్వేనెంబర్ 505లో రమావత్ గేమా, రామావత్ అస్లీ,రమావత్ లాలు పేర్ల మీద ఉన్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో జొన్న పంటను సేద్యం చేశారు.ఇట్టి భూమిని ఆక్రమణ గురి చేయడానికి శాగం ఈశ్వరమ్మ సాగుచేసిన జొన్న పంటపై గడ్డిమందు పిచికారీ చేసి పంట ఎండిపోయేందుకు కారకురాలైందని గిరిజన రైతులు ఆరోపించారు. ఈ విషయమై రెవెన్యూ, వ్యవసాయ అధికారులు స్పందించడంతో సోమవారం చలకుర్తి ఏఈఓ సితార బాధిత రైతుల భూములను పరిశీలించారు.శాంపిల్స్ సేకరించానని,వాటిని జిల్లా వ్యవసాయఅధికారులకు పంపుతామని తెలిపారు.వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు.