Authorization
Fri March 21, 2025 07:36:12 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండల పరిధిలోని కొత్తలూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులలో ప్రభుత్వ రేషన్ బియ్యం బస్తాలతో నిండి ప్రభుత్వ చౌకదారు దుకాణంలా మార్చారని ఎస్ఎఫ్ఐ సాగర్ డివిజన్ కార్యదర్శి కోరే రమేష్ విమర్శించారు.సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.రేషన్ డీలర్ ఇచ్చే డబ్బులకు ఆశపడి తరగతిగదుల్లో రేషన్ బియ్యం ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.విద్యార్థుల భవిష్యత్లో చెలగాటమాడుతున్న హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పాఠశాలలో సుమారు 45 మంది విద్యార్థుల చదువులు సాగేదెలా అని ప్రశ్నించారు.స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల లను పరిశీలించకపోవడంతో ఇలా జరుగుతున్నదన్నారు..ప్రభుత్వం ఒక వైపు మన ఊరు- మనబడి ప్రణాళికలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివద్ధి కోసం ప్రయత్నిస్తుంటే ఇలాంటి తరగతి గదులు అద్వాన్నంగా మారాయని తెలిపారు.హెచ్ఎం తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు.