Authorization
Wed March 19, 2025 06:59:09 am
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
తెలంగాణ సాయుధ పోరాట యోధులు,సీపీఐ సీనియర్ నాయకులు గోద యాదగిరి ఆశయ సాధనకు ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో యాదగిరి 23వ వర్ధంతి సభ నిర్వహించారు.ముందుగా స్తూపం వద్ద ఉన్న అరుణపతాకాన్ని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య ఎగురవేయగా గోద యాదగిరి చిత్రపటానికి సీనియర్ నాయకులు బబ్బురి నాగయ్య పూలమాల వేశారు.అనంతరం జరిగిన సభలో శ్రీరాములు మాట్లాడుతూ ఆలేరు ప్రాంతంలో పేద ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నాయకుడు యాదగిరి అని కొనియాడారు.గుట్ట ప్రాంతంలో యువతను ఉద్యమ బాటలో నడిచేందుకు కృషి చేశాడన్నారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి పెరబోయిన మహేందర్ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ ,కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ ,బండి జంగమ్మ ,కొల్లూరు రాజయ్య,చెక్క వెంకటేష్ ,ఉప్పల ముత్యాలు ,ఏశాల అశోక్ ,మండల కార్యదర్శి జిల్లా జానకి రాములు ,జిల్లా కమిటీ సభ్యులు బబ్బురి శ్రీధర్, కల్లేపల్లి మహేందర్ ,గోరేటి రాములు మండల నాయకులు గోపగాని రాజు ,పెరబోయిన బంగారు ,ఆరె పుష్ప ,మునుకుంట్ల నర్సమ్మ, గుండు వెంకటేష్ ,ముక్కెర్ల పెంటయ్య ,ఎర్రం శీను ,చందు నాయక్ ,పాకలపాటి రాజు ,కంబాల వెంకటేష్ ,బండపల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.