Authorization
Wed March 19, 2025 06:42:48 am
నవతెలంగాణ -ఆలేరుటౌన్
వివిధ రంగాల్లో వెనుకబడిన మున్నూరు కాపు కులస్థులకు ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఐదెకరాల స్థలం ,భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలనికోరుతూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీకి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం గౌరవ అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, పట్టణఅధ్యక్షులు ఎలగల స్వామి ,ప్రధాన కార్యదర్శి ఎలగల అంజయ్య ,కోశాధికారి పత్తి రాములు ,తోట బాలరాజు, ఎలగల రాము ,ఎలగల పాపయ్య, ఎలగల శివకుమార్, ఎలగల వెంకటేష్ , ఎం సంతోష్ తదితరులు ఉన్నారు.