Authorization
Sat March 08, 2025 11:16:32 pm
- ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర విమర్శించారు .సోమవారం పట్టణంలో జరిగిన ఆ సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిందని ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.మత చందసావాద విధానాలతో యువతను తప్పుదోవ పట్టిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూల విధానాలను,చట్టాలను రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం ముందుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించడంలో అలసత్వం వహిస్తోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ యువజన రంగ సమస్యలను పరిష్కార సాధన కోసం యువత సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్,ఆఫీస్ బేరర్స్ కొండూరు వెంకటేష్, ఎండి నయిం, బద్దుల శ్రీను మొగుళ్ల శేఖర్ రెడ్డి,సుద్దాల సాయికుమార్ ,పేరబోయిన మహేష్ ,కంబాల వెంకటేష్ ,మేడి దేవేందర్ ,నరేందర్ ,పాకలపాటి రాజు ,అనంతుల నరసింహ ,కంబాల నరసింహ ,కోల హరీష్ పాల్గొన్నారు.