Authorization
Thu March 20, 2025 06:43:58 am
నవతెలంగాణ-మోత్కూరు
ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ నే తుంగతుర్తి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మోత్కూరు మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెంగ్రామంలో మంగళవారం ఆయన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కిశోర్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు చేస్తున్నారని, బీటీ, సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేపట్టారని, అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీటవేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వనం స్వామి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధానకార్యదర్శి గజ్జి మల్లేష్, దేవరపల్లి నర్సిరెడ్డి, కొణతం లింగారెడ్డి, కొణతం యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.