Authorization
Mon March 17, 2025 09:33:38 am
నవతెలంగాణ-అడ్డగూడూర్
సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం మండలంలోని బొడ్డుగూడెం స్టేజి వద్ద రోడ్డుపై బైటాయించి ఆందోళన నిర్వహించారు. బడికి వెళ్లే సమ యానికి స్టేజి వద్ద ఆర్డినరీ బస్సులు రావడంలేదని స్కూల్ కి వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొర్రూర్ డిపో, సూర్యాపేట,డిపో యాద గిరిగుట్ట డిపో మేనేజర్లు స్పందించి ఉదయం 8:30ని,లకు ఆర్డినరీ బస్సులు హైదరాబాద్ రూట్ లో వేయాలని డిమాండ్ చేశారు.