Authorization
Thu March 20, 2025 12:18:26 am
నవ తెలంగాణ- బీబీనగర్
వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ధీపక్ తివారీ ఉపాధ్యాయులకు సూచించారు, మంగళవారం మండలంలోని గూడూరు ప్రాథమిక పాఠశాలలో ఆయన సందర్శించారు. సందర్భంగా పాఠశాలలో అమలు అవుతున్న ఎఫ్ఎల్ఎన్ బోధన ను పూర్తిస్థాయిలో సమీక్షించారు, అనంతరం విద్యార్థులను తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో ప్రశ్నలను అడిగారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం చెప్పడంతో విద్యార్థుల ప్రగతి పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, స్థానిక సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి, ఎంపీడీవో శ్రీవాణి, ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి, ఎంపీ ఓ స్వాతి, తదితరులు పాల్గొన్నారు.