Authorization
Fri March 21, 2025 02:54:07 am
నవతెలంగాణ-నేరేడుచర్ల
మండలంలోని నేరేడుచర్ల నుండి దాసారం వెళ్లే రోడ్డును వెంటనే నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు కోరారు.బుధవారం మండలంలోని ముకుందాపురం గ్రామంలో మర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.నేరేడుచర్ల మండలకేంద్రం నుండి వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులు,అంతర్గతరోడ్లు గుంతలమయంగా ఉన్నందున నిత్యం వేలాదిమంది ప్రజలు, రైతులు, కూలీలు, ఉద్యోగులు, చిరువ్యాపారులు రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణం అరిచేతిలో పెట్టుకొని భయంగా వెళ్లాల్సి వస్తుందన్నారు.వెంటనే నేరేడుచర్ల నుండి దాచారం వరకు రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, మండల కార్యదర్శి సిరికొండ శ్రీను,మండలకమిటీ సభ్యులు మామిడి నాగసైదులు, కట్టమధు, మచ్చ సోమయ్య, అల్వాల శ్రీధర్, బుడిగేధనుంజయ, దొరేపల్లి సత్యం, పర్సనబోయినసైదులు, చలసాని అప్పారావు, పర్సనబోయిన చిన్నసైదులు పాల్గొన్నారు.