Authorization
Sat March 08, 2025 08:25:08 am
నవతెలంగాణ -నూతనకల్
రైతులు సాంప్రదాయ పద్ధతులను మానుకొని ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడులను పొందవచ్చు అని మండల వ్యవసాయ అధికారి మురళి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మారగాని నారాయణ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి డ్రం సీడ్ ద్వారా విత్తనం నాటే విధానం పట్ల అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి నాటు వేసే కూలీల రేట్లు అధికంగా ఉండడంతో నాటుకు బదులు డ్రం సీడు ద్వారా విత్తనాలు నాటితే ఎకరాకు సుమారు రూ.4500 మిగులుతాయన్నారు. ఈ సీజన్లో మండలంలో ఇప్పటికే సుమారు 150 ఎకరాల వరి డ్రం సీడ్ పద్ధతిలో సాగు చేస్తున్నారని తెలిపారు. ఆయన వెంట ఏఈఓ శ్రావణి, రైతులు ,తదితరులు ఉన్నారు.