Authorization
Wed March 19, 2025 10:02:01 am
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో బిల్లింగ్ పైపెచ్చులూడుతున్నాయి.కాగా బుధవారం పాఠశాలను గ్రామ సర్పంచ్ ఎల్లంల శాలిని జంగయ్యయాదవ్, పాఠశాల విద్యాకమిటీ చైర్మెన్ బండారు రఘుపతి సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల శిథిలావస్థకు చేరుకుందన్నారు.పాఠశాల బిల్డింగ్ పైపెచ్చులు ఊడడంతో విద్యార్థులకు గాయాలవున్నాయన్నారు.ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని నూతన తరగతి గదులు మంజూరు చేయాలని కోరారు.