Authorization
Fri March 07, 2025 01:42:47 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పెరిక కుల భవన నిర్మాణం కోసం పట్టణంలో కొంత స్థలాన్ని అధికారికంగా ప్రకటించి నిర్మాణం కోసం కూడా సహకరిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో జిల్లా పెరిక కుల సంఘం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పెరిక కులస్తులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులు వనపర్తి లక్ష్మీనారాయణ వర్మ మాట్లాడుతూ క్యాలెండర్ కి ప్రకటనలు ఇచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల రాంబాబు , కుల పెద్దలు జుట్టుకొండ సత్యనారాయణ , అంగిరేకుల నాగార్జున, దొంగరి వెంకటేశ్వర్లు , సుంకరి అజయ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.