Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, స్థలం ఉన్న పేదల ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈనెల 3న తాసీిల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఐద్వా, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శులు భూతం అరుణ కుమారి, గుండాల నరేష్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో పట్టణ ప్రజాసంఘాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సీఐటీయూ, ఐద్వా, డీివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో తాసీిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు చేసి మెమొరండాలు ఇవ్వాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక పిలుపు మేరకు ఫిబ్రవరి 3న నల్లగొండ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలో అర్హత కలిగిన పేదలందరూ ఫిబ్రవరి 3న నల్లగొండ తాసిల్దార్ కార్యాలయం ముందు, ఫిబ్రవరి 9న హైదరాబాద్ ఇందిర పార్కు దగ్గర జరిగే ధర్నాలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ, ఐద్వా, డీివైఎఫ్ఐ సంఘాల పట్టణ నాయకులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, సాగర్ల మల్లయ్య, దాసోజు ప్రభుచారి తదితరులు పాల్గొన్నారు.