Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
సమాజంలో జరుగతున్న వార్తలను సేకరించి ప్రభుత్వాలకు,ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుపై దాడులు చేయడం హేయమైన చర్య అని గుండాల ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పురుగుల మల్లేష్ అన్నారు.గురువారం గుండాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మోత్కూరు నవతెలంగాణ రిపోర్టర్ అవిశెట్టి యాదగిరిపై మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి భర్త మేఘారెడ్డి అనుచరుల దాడిని ఖండిస్తూ చౌరస్తా వద్ద నల్ల్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు తమ స్వలాభం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం అనునిత్యం పాటుపడే వారని అన్నారు.చాలి చాలని జీతాలతో కుటుంబం గడవని పరిస్థితుల్లో జర్నలిస్టులు సమాజం కోసం పనిచేస్తున్నారన్నారు. అటువంటి జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య అని యాదగిరి పై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని,జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, మల్లారెడ్డి, దశరథ, సురేందర్, ఇర్ఫాన్, నరేష్, రాజు, యాదగిరి, స్వామి, నాగరాజు, మల్లేష్, ఉస్మాన్, రాజు, నరేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.