Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కాసుల నరేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలరిషిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా విద్యారంగానికి నిధులు కోత విధించడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్నారు. అనంతరం ఆర్ ఐ నరేంద్ర చారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కందుల నాగరాజు, ఉపాధ్యక్షులు విక్రమ్, భవాని, లావణ్య ,రమ్య ,పూజిత, క్రిస్టఫర్, కళ్యాణ్, సుందర్ ,రాజేష్, కిరణ్ ,వెంకటేష్ ,మనోజ్, సిద్ధులు, రాకేష్ ,రాజు, మహేష్, గణేష్ పాల్గొన్నారు.