Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ రూరల్
మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూములను సర్వే చేయడానికి వచ్చిన మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఆర్ఐ, మండల సర్వేయర్లను శుక్రవారం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టుబడిదారులు కార్పొరేట్ల కోసం గతంలో చేసిన అలైన్మెంట్ను మార్చి తిరిగి చిన్న సన్నకారు రైతుల భూముల పై నుండి రీ సర్వే చేసి వారి భూములను లాక్కోవడం దుర్మార్గమన్నారు. వెంటనే పాత పద్ధతిలోనే అలైన్మెంట్ను కొనసాగించాలని కొత్తగా చేసిన అలైన్మెంట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల కమిటీ డివిజన్ మాడుగుల యాదగిరి, రైతులు సోలిపురం జనార్దన్ రెడ్డి,మెట్టు రవీందర్ రెడ్డి,నాగేల్లి దశరథ,బంగారు నరసింహ,మురళి,నాగేల్లి వెంకటయ్య,నాగేల్లి వెంకటమ్మ,నారి వెంకటేష్,నారి శ్రీకాంత్,మీసాల పద్మ,బంగారు యాదమ్మ,నాగేల్లి సరిత మెట్టు నర్శిరెడ్డి,సుధాకర్ రెడ్డి ,బంగారు నర్సింహ, మైపాల్,,మీసాల శ్రీహరి,మాడుగుల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.