Authorization
Thu March 06, 2025 10:54:49 am
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కొండపైకి చేరుకున్న గవర్నర్ కు కలెక్టర్ పమేలా సత్పతి స్వాగతం పలుకగా , పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆలయ ముఖ మండపం వద్ద అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్బాలయంలో దర్శన అనంతరం అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం జరిపి స్వామివారి ప్రసాదాలను జ్ఞాపకం అందజేశారు. గవర్నర్ పర్యటన దష్ట్యా ఉదయం నుండే పట్టణంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఇన్చార్జి ఈఓ రామకష్ణారావు, అదనపు ఈవో భాస్కర్ ,ఏఈవోలు గజ్వేల్ రమేష్ బాబు ,అర్చకులు పాల్గొన్నారు.