Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్
దేశ సమైక్యత దేశసమగ్రత కోసమే రాహుల్‌గాంధీ జోడోయాత్ర చేపట్టారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ సమగ్రత సమైక్యత కోసమే కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ భారత్ జోడు యాత్ర నిర్వహించారని తెలిపారు ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేకుండా ఈ యాత్ర జరిగిందన్నారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం దేశ రాష్ట్ర అభివద్ధిని నాశనం చేస్తున్నాయన్నారు.మోడీ ప్రభుత్వం పరిపాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని,నిరుద్యోగం పెరిగిందన్నారు.కార్మికుల చట్టాలు నాశనం చేసి జాతీయ సంపదను కొందరికే దోచిపెట్టాలని చూసిందన్నారు.తాను 30 ఏండ్లు రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా మంత్రిగా పనిచేసినప్పటికీ ఎటువంటి స్వార్థ రాజకీయాలకు అవినీతికిపాల్పడలేదన్నారు.నేడు రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు.హుజూర్నగర్ నియోజకవర్గంలో దోపిడీ దొంగల పరిపాలన సాగుతుందని, స్థానిక ఎమ్మెల్యే కమీషన్లకు కక్కుర్తి పడి అభివద్ధికి ఆటంకంగా మారా డన్నారు.ఎమ్మెల్యే తన ఇష్టానుసారం మర్యాదలేకుండా మాట్లాడు తున్నాడని ఆయనకు బుద్ధి చెప్పడానికే తాను హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నానన్నారు.50 వేల మెజార్టీతో తాను గెలుస్తానని చెప్పారు.హుజూర్నగర్ నియో జకవర్గ ప్రజలన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.గతంలో పనిచేసిన ఏ ఎమ్మెల్యేలు కూడా చేయని అవినీతి ప్రస్తుత ఎమ్మెల్యే చేస్తున్నాడని ఆరోపి ంచారు.గ్రామపంచాయతీ పరిధిలో ఎల్ఈడీి లైట్లు కొనుగోలు నుండి ట్రాక్టర్ల కొనుగోలు వరకు అదేవిధంగా ప్రతి పనికి పర్సంటేజ్ తీసుకుంటూ అధికార దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, రెవెన్యూ,పోలీస్అధికారులను తమకు తొత్తులుగా వాడు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నియోజకవర్గ పరిధిలో కొత్త లిఫ్టుల మంజూరు తర్వాత గాని, పాత లిఫ్టులను మరమ్మతు చేసే పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే లేడని ఆరోపించారు.తాను హుజూర్నగర్ నియోజకవర్గం ఏర్పాటుకు కషి చేయడమే కాకుండా నియోజకవర్గంలో వంద పడకల ఏరియా హాస్పిటల్ రెవెన్యూ కార్యాలయ భవనం పోలీస్ స్టేషన్ మెయిన్‌రోడ్డు నిర్మాణం సెంట్రల్ లైటింగ్ ఆర్డీఓ కార్యాలయం ఈ విధంగా తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అనేక పనులను ఆయన వివరించారు.ఈనెల 6వ తేదీ నుండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు గ్రామాల్లో హాత్ సే హాత్ జోడు కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలవాలన్నారు.ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ కార్య క్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.నెల రోజుల్లో నియోజక వర్గపరిధిలో ప్రతి కుటుంబాన్ని కార్యకర్తలు కలవాలన్నారు.ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అనురాధ,ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్నగౌడ్, సామల శివారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి తన్నీరు మల్లికార్జున్,మంజునాయక్, చెవిటి వెంకన్న, వి.సైదేశ్వరరావు, కీత రమేశ్, గోవింద్, జక్కుల మల్లయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.