Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా వత్తిదారులకు 20వేల కోట్ల రూపాయలు అన్ని వత్తులకు బడ్జెట్లో కేటాయించాలని బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలో వడ్డెర వృత్తిదారుల సంఘం క్యాలెండర్‌ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎనిమిదేండ్ల కాలంలో బడ్జెట్లో కేటాయించేటువంటి డబ్బులు కూడా కేటాయించినట్లే కేటాయించి ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా గొర్ల, మేకల పెంపకం దారులకు నగదు బదిలీ పథకం చేస్తానని పెంపకం దారులకు హామీ ఇచ్చి తమ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ పడిన తర్వాత అకౌంట్లో పెట్టి డబ్బులు వాడుకోకుండా పెంపకం దారులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఓడ ఎక్కిన తర్వాత ఓడ మల్లయ్య ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అనంతరం వత్తిదారులందరినీ విస్మరించింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వత్తిదారుల సమస్యలు పరిష్కరించి వత్తిదారులకు ఇచ్చిన హామీలను వత్తిదారులకు 50 సంవత్సరాలు నిండిన వాళ్లకి పింఛన్లు , అరులైన పేదలందరికీ ఇంటి స్థలానికి ఐదు లక్షల రూపాయలు, అదే రకంగా వత్తి సంక్షేమం, వత్తి రక్షణ కోసం ప్రభుత్వం విధి విధానాల బడ్జెట్‌ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉరుకుప్పల ముత్యాలు, తెలంగాణ రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, తెలంగాణ గొల్ల కురుమల వత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల మల్లేష్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయగౌడ్, యాసరాని శ్రీను, తదితరులు ఉన్నారు.