Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పస్తులతోనే పనులు
- పండుగలకు జీతాలు అందని వైనం తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులు
- పొద్దు పొడవక ముందే పనుల్లో
- మున్సిపల్లో 56 మంది సిబ్బందితోనే పనులు
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
భూదాన్ పోచంపల్లి నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి వంద రోజులైనా జీతాలు ఇవ్వడం లేదు.నవంబర్,డిసెంబర్,జనవరి నెలతో పాటు ఫిబ్రవరి నెల ప్రారంభమై రోజులు గడుస్తున్న జీతాలు ఇవ్వడం లేదు.దీంతో సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.సంక్రాంతి పండుగకి కూడా జీతాలు వేయకపోవడంతో పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులంతా జీతాలపై ఆధారపడి బతికే కుటుంబాలు కావడంతోఇండ్లు గడవడానికి కిరాణం షాపులలో తెలిసిన వారి వద్ద అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.షాపులలో తీసుకొచ్చిన సామాను అయిపోయే మళ్లీ షాప్‌లోకి వెళ్లాలంటే డబ్బులు లేక ఎంతోమంది కార్మికులు షాపులకు వెళ్లలేక పస్తులతోనే కాలం గడుపుతున్న పరిస్థితులు వార్డులను శుభ్రం చేసి గ్రామాన్ని పరిశుభ్రతంగా ఉంచే కార్మికులకు జీతాలు మాత్రం ఇవ్వరు.అమవాస్యపున్నమికి వచ్చే వారికి మాత్రం జీతాలు రూ.వేలల్లో ఉంటాయి.వాళ్లకు మాత్రం ప్రతినెలా 5న జీతాలు వాళ్ల ఖాతాలో ఉంటాయి. కార్మికులు పొద్దు పొడవక ముందు నుండి ప్రారంభమై సాయంత్రం వరకువెట్టి చేస్తూ వాడలను శుభ్రం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రతంగా ఉంచే కార్మికులకు మాత్రం జీతాలు ఉండవు
మూడు నెలల నుండి జీతాలు లేవు
నవంబర్, డిసెంబర్, జనవరితో కలుపుకొని మూడు నెలల జీవితంలో కనీసం రెండు నెలల జీతం వేసిన కార్మికుల కొంత చేయి తిరిగేదని వాపోతున్నారు.కార్మికులకు మున్సిపాలిటీలో చేసే పని తప్ప బయట వేరే పని చేసుకునే అవకాశం కూడా లేదు.ఉదయం 4 గంటలకు వీధుల్లో చేరితే సాయంత్రం వరకు ఇంటికి వెళ్లలేని పరిస్థితి.పూర్తిగా మున్సిపాలిటీ జీతం పైనే ఆధారపడడంతో ఇండ్లు గడవడం కష్టంగా మారింది.కిరాణా షాపులలో రెండు నెలలుగా బాకీ పెడుతుండడంతో ఉద్దర కూడా ఇవ్వడం లేదు.మున్సిపల్ కేంద్రమైన పోచంపల్లి విలీన గ్రామాలు ముక్తాపూర్,రేవనపల్లి కలుపుకొని 13 వార్డులు మొత్తం56 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.సుమారు రూ.8.85 లక్షల ప్రతినెలా కార్మికులకు చెల్లించాల్లి ఉంటుంది.జీతాలను ఎక్కువగా ప్రతినెలా వచ్చే పట్టణ ప్రగతి నిధులు సాధారణ నిధుల నుంచి చెల్లిస్తున్నారు.ఆస్తిపన్నులు పెండింగ్‌లో ఉన్న నల్లాబిల్లులు కూడా ప్రస్తుతం సిబ్బంది ముమ్మరంగా వసూలు చేస్తున్నారు. బిల్లులు చెల్లించని ఎడల నల్లాకలెక్షన్లు కట్ చేస్తామని చెబుతూ ప్రజల నుండి బలవంతంగా వసూలు చేస్తున్నారు. కార్మికులకు మాత్రం జీతాలు చెల్లించడం లేదు.ఇప్పటికే రెండు నెలలుగా కిరాణా షాపులలో నిత్యావసర సరుకులకు ఉద్దెర పెట్టడంతోజీతాలు ఇంకా ఆలస్యం అవుతుండడంతో అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని కార్మికులు వాపోతున్నారు. జనవరి నెల కూడా ముగియడంతో నవంబర్, డిసెంబర్, జనవరినెలల జీతం ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు
జీతాలు లేకుంటే జీవితాలు గడిపేదెలా
సీఐటీయూ నాయకులు-మంచాల మధు
నిత్యం మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, ఎన్నిసార్లు కమిషనర్ దష్టికి తీసుకెళ్లి ధర్నా చేసిన ఫలితం లేకుండా పోయింది.వారికి ఇంతవరకు వేతనాలు చెల్లించలేదు.వేతనాలు రాకుండా మూడు నెలలుగా కార్మికులతో వెట్టి చేయిం చుకుంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు కాలమెళ్లదీస్తు న్నారు.కార్మికుల వేతనాలు చెల్లించాలని అడిగితే తగిన బడ్జెట్ లేదని వేతనాలు ఇవ్వడం కుదరదని అంటున్నారు. మూడు నెలలు నుండి జీతాలు లేక కార్మికులు అప్పు చేసి కుటుంబాలను పోషించుకుంటూ ఉదయాన్నే నాలుగు గంటల వరకు రోడ్డు మీదికి చేరుకొని రోడ్డులలో చెత్తాచెదారం,డ్రయినేజీలను శుభ్రం చేస్తూ పోచంపల్లి కేంద్రాన్ని శుభ్రంగా ఉంచడంలో ముఖ్యంగా కీలకపాత్ర మున్సిపల్ కార్మికులే పోషిస్తున్నారు.ప్రతినెలా 5 వ తేదీ వేతనాలు చెల్లించాల్సిందే.అనేకసార్లు మున్సిపల్ కమిషనర్‌కు వారి సమస్యలు పైన వినతి పత్రాలు ఇచ్చినా బడ్జెట్ లేదని సాకుతో నిర్లక్ష్యంగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా వారితో పని చేయిస్తున్నారు.