Authorization
Mon March 17, 2025 07:44:56 am
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్
నవతెలంగాణ-గుండాల
మండలకేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 12వ తేదీ ఆదివారం 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించే జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్‌ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్‌కుమార్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌లో జరుగబోయే 10వ తరగతి వార్షిక పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా తమసంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు.మండలంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ హాజరు కావాలన్నారు.విద్యార్థుల భవిష్యత్ అవసరాల నిమిత్తం తెలంగాణ బడ్జెట్లో విద్యకు 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు సతీష్,సైదులు,మహేష్ తదితరులు పాల్గొన్నారు.