Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న 18 విద్యాసంస్థలకు అంతర్ కళాశాల క్రీడాపోటీలు స్థానిక శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి డిగ్రీ కళాశాలలో మాజీ టెస్ట్ క్రికెటర్, ఎంవీ నర్సింహారావు ప్రారంభించారు.ముందుగా ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం క్రీడాజెండా ఎగురవేసి జ్యోతిప్రజ్వలన గావించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.విద్యార్థులు క్రీడలలో పాల్గొంటూ తాము తమ శక్తి సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలన్నారు.తద్వారా తమ వ్యక్తిగత, శారీరక దారుఢ్యంతో పాటుగా స్నేహభావాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగ పడుతుందన్నారు.గెలుపోటములను తట్టుకునే స్థోమతలను పెంచుకుంటారని, తదనుగుణంగా ఈ ఆటలలో ప్రతి విద్యార్థి పాల్గొని తమవంతుగా తమ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ కోఆర్డినేటర్ హరినారాయణ, కళాశాల కార్యదర్శి రావి సుఖేష్‌రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ క్రీడలఅడ్వయిజర్ మంజిత్‌రెడ్డి, కన్వీనర్ డాక్టర్ టీఎన్.వంశీతిలక్, అనురాగ్మిశ్రా, జాయింట్ కన్వీనర్ వనంవరుణ్, హిందూ పత్రిక చీఫ్ రిపోర్టర్ స్వరూప్ ,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.శ్రీనివాస్, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రమేశ్, ఫిజికల్ డైరెక్టర్ బి.పాండురంగం,డాక్టర్ కెప్టెన్ బి.జగన్నాథ్, కె.కృష్ణయ్య, కోఆర్డినేటర్ పి.బాల్‌రెడ్డి, జి.స్నేహలత, ఎన్.సుధా, కనక బాలరాజు, సాదు రామకృష్ణ పాల్గొన్నారు.