Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
ఎస్జేజేటీ విశ్వవిద్యాలయం, రాజస్థాన్ సోమవారం నిర్వహించిన 11వ స్నాతకోత్సవంలో భాగంగా ప్రిన్సేటన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఘట్కేసర్,మేడ్చల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎలిమినేటి మదుసుధన్రెడ్డికి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.కాగా అతను యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, గౌస్‌నగర్ గ్రామానికి చెందిన వ్యక్తి డాక్టరేట్ అందుకుపోవడం పట్ల గ్రామస్తులు హర్షం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒరిస్సా గవర్నర్ ప్రొఫెసర్ గణేష్‌లాల్, యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ వినోద్ టిబ్రివాల హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రిన్సెటన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మెన్ డాక్టర్ ప్రభాకర్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్‌కే.సత్యనారాయణ, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ హరికిరణ్, కళాశాల బృందం మిత్రులు, కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు.