Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
జర్నలిస్టులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని అక్రమ కేసులను సంహరించు కోవాలని టీఎస్‌యూ వ్యవస్థాపక అధ్యక్షుడు, అడ్వకేట్ పర్రెపాటి యుగంధర్ అన్నారు.మోత్కూరు నవతెలంగాణ రిపోర్టర్ యాదగిరిపై దాడి చేసిన్ ఘటనను ఖండిస్తూ ఆదివారం రిపోర్టర్ యాదగిరిని, కుటుంబసభ్యులను పరామర్శించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మెన్ భర్త వర్సెస్ మున్సిపల్ కౌన్సిలర్లు అనే వార్త రాసిన విషయంలో యాదగిరిపై జరిగిన దాడిని సామాజిక చైతన్యం కలిగిన వారిగా తీవ్రంగా ఖండించారు. అక్రమంగా పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీస్ డిపార్ట్మెంట్ మరోసారి విచారణ జరపాలని కోరారు. రాసిన వార్త తప్పయితే దానిని ఖండించాలే తప్ప రిపోర్టర్‌పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.మీ రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగ బిడ్డలను వాడుకొని మాదిగలంటే నియోజకవర్గంలో రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు .ఇలాంటి నీచమైన రాజకీయాలను మానుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జక్కుల రాముయాదవ్, మోత్కూరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మందుల సురేష్, కమ్మంపాటికుమార్, పోచంసోమయ్య, సజ్జనం మనోహర్, దర్శనాల సతీష్, ఆకుల నరేష్‌యాదవ్, వేణు తదితరులు పాల్గొన్నారు.