Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు,అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని టెస్కాబ్ వైస్‌చైర్మెన్,ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.యాదగిరిగుట్టలోని గొంగిడి నివాసంలో గుండాల మండలం మరిపడిగ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పానుగంటి సామ్యూల్, ఏసురత్నం, జీవరత్నం,మాజీ మండల సమాఖ్య అధ్యక్షురాలు పానుగంటి జయమ్మ,యువ నాయకులు పానుగంటిసాల్మన్, విజరు, రూపస్,బోయిన మహేష్,కల్లెపు లక్ష్మయ్య,గూడెం నర్సయ్య, సింగారం నాగరాజుతో పాటు సుమారు 100 మందికి గొంగిడి మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్,మండలఅధ్యక్షుడు ఎండీ ఖలీల్, వైస్‌ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి,మార్కెట్ వైస్ చైర్మెన్ మూగల శ్రీనివాస్ సర్పంచులు దుంపల శ్రీనివాస్,దార సైదులు, నాయకులు మందడిరావుకృష్ణారెడ్డి,సంగి వేణుగోపాల్,కోలుకొండ రాములు, అనంతుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.