Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళశాలలో సోమవారం ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రెసిడెన్సీ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఎంతో క్రమ శిక్షణతో ఉంటారన్నారు .పాఠశాలలో చదివే విద్యార్థులు ఎంబీబీఎస్‌లో కానీ, ఇంజనీర్లోగానీ ఐఐటీగానీ, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ప్రెసిడెన్సీ విద్యాసంస్థల చైర్మెన్తీగల జయలక్ష్మీ మాట్లాడుతూ కరోనా తర్వాత ఇంత పెద్దఎత్తున వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులు,తల్లిదండ్రుల మధ్య జరుపుకో వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ ఫౌండర్ సీతారామానుజన్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి మంచి క్రమశిక్షణ అలవర్చుకొని చదువుల్లో ముందుండి పేరుకు తగ్గట్టు అకాడమిక్ హైట్స్‌లో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటా రన్నారు.విద్యార్థులు ఆకట్టుకునే విద్య బోధన చేయడం ద్వారా వారిలో మానసికస్థాయికి పెంపొందిం చుకుంటారన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, దిడ్డి బాలాజీ, పాఠశాల డైరెక్టర్ మణిపాల్ రెడ్డి పాల్గొన్నారు.