Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని చీకటిమామిడి గ్రామంలో వారం అంగడి వాహనదారులకు తలనొప్పి తెచ్చిపెడు తోంది.నాలుగు రోడ్లను కలుపుకునే ప్రధాన చౌరస్తాలో సంత ఏర్పాటు చేయడంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న దుకాణాల వద్ద జనం గుంపులు గుంపులుగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.ము ఖ్యంగా భువనగిరి, యాదగిరిగుట్ట,హైదరాబాద్, మూడు చింతలపల్లికి వెళ్లే నాలుగు రోడ్లను కలుపుకుని ప్రధాన చౌరస్తాగా ఏర్పడి నిత్యం రద్దీగానే ఉంటుంది.భారీ వాహనాలు నిత్యం ప్రయనిస్తూనే ఉంటాయి. ఇవే కాకుండా ఇటుక బట్టీలు,క్రషర్ మిల్లుల నుండి వచ్చే టిప్పర్ లారీలు కూడా అధిక స్పీడ్‌తో వచ్చి వెళ్తూ ఉంటాయి.ప్రతి సోమవారం రోడ్డుకిరువైపులా అంగడిని నిర్వహిస్తుండడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదని తలబాదుకుంటున్నారు. సోమవారం వచ్చిందంటూ చాలు ఇక వాహనదారులకు చుక్కలే.రోడ్లపై గుంపులు గుంపులుగా జానాలు చేరి కొనుగోళ్లు చేస్తుండడంతో మార్కెట్ అంతా సందడిగా మారి వచ్చి పోయే వాహనాలకు అడ్డుగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది.వాహనదారులకు దారి వదిలి సంతను ఏర్పాటు చేసుకోవాలని లేదా మార్కెట్‌ను మరో చోటుకు మార్చాలని వాహ నదారులు కోరుతున్నారు.