Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-వలిగొండ
బీఆర్ఎస్ 9 ఏండ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.సోమవారం వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాత్ సే హాత్ భారత్ జోడో యాత్ర సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.తొమ్మిది ఏండ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.నాలుగు ఏండ్లైనా రైతు రుణమాఫీ చేయలేదని, ఉద్యోగ నోటిఫికేషన్ ఒక ఎన్నికల స్టంట్ అన్నారు.రైతుబంధుతో రైతులకు లాభం లేదన్నారు.మద్దతు ధర పెంచితే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ పెద్దలకు లాభం చేకూర్చిందన్నారు.పేద రైతులకు ధరణితో న్యాయం జరగడం లేదన్నారు.తెలంగాణలో ఏమీ చేయలేని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్తో దేశ రాజకీయాలలో ఏం చేస్తారన్నారు. బీబీనగర్ లోని నిమ్స్ కాంగ్రెస్ పార్టీ హయంలో కట్టించడం జరిగిందని నేడు ఎయిమ్స్‌గా మారినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన సదుపాయం కల్పించకపోవడంతో పేద ప్రజలకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, నూతి రమేష్, తుమ్మల యుగంధర్‌రెడ్డి, గుండు దానయ్య, వాకిటి పద్మా అనంతరెడ్డి, తుమ్మల నర్సయ్య, పల్సం సతీష్, బాతరాజు ఉమా బాలనర్సింహ, కుంభం వెంకట్‌పాపిరెడ్డి, గంగాపురం దైవాదినం, పులిపలుపుల రాములు, ఎండి సలీం, గూడూరు వెంకటరెడ్డి, వంగాల అశోక్, బెలిదే నాగేశ్వర్, బద్దం సంజీవరెడ్డి, బత్తిని సహదేవ్, బత్తిని పాండు, కొండూరు సాయి, కాసుల వెంకటేశం, ఎలిమినేటి సురేష్, సయ్యద్ బాబా, కీర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.