Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ మాటలు నీటి మూటలేనా
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య
నవతెలంగాణ-చింతపల్లి
అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని, కెేసీఆర్ మాటలు నీటి మూటలేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య అన్నారు. సోమవారం చింతపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం నాయక్ తహసిల్దార్ హర్షద్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పేదలకు డబల్ బెడ్ రూమ్లు లేవని, ఇండ్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ కట్టించి ఇస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు. ఒకవేళ డబుల్ బెడ్ రూములు ఏర్పాటు చేసిన లాటరీ పద్ధతిలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ఆ డబల్ బెడ్ రూమ్లు ఇచ్చారని ఆరోపించారు. తక్షణమే ఇండ్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అసెంబ్లీలో ఇండ్లు లేని నిరుపేదలకు ఐదు లక్షలు ఇచ్చే జీఓను అమలు చేయాలని అసెంబ్లీలో ప్రకటనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్, మండల కార్యదర్శి ఉడుకుంట్ల రాములు, పడకంటి వీరమ్మ, పడకండి బక్కయ్య, పడకంటి జంగయ్య పడకండి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి : అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బండపాలెం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం క్యాంపెను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆదిమల్ల నాగయ్య, చెవ్వుగోని నాగయ్య, నాయకులు మల్లయ్య, శ్రీరాములు, బిక్షం తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దామచర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వినోద్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించాయన్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఎంతోమంది ప్రజలు సొంతిల్లు లేక నానా ఆవస్థలు పడుతున్నట్లు చెప్పారు. తక్షణం ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను ఆయా పేదలకు కేటాయించాలని కోరారు. అనంతరం తాసిల్దార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు పాపా నాయక్, సీఐటీయూ నాయకులు సుభాని, దయానంద్ , రవి, కరీమా, గోపి, హనుమంతు, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.
వేములపల్లి : అర్హులైన నిరుపేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని మండలంలోని ఉమ్మడి అమనగల్లు గ్రామపంచాయతీకి చెందిన లబ్ధిదారులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పాదూరు శశిధర్రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు ఇల్లు నిర్మించుకోవడం కోసం సొంత స్థలాలు లేక, స్థలాలు ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునే స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పేదలకు ఇంటి స్థలాలు ఇండ్లు నిర్మించడం కోసం మూడు లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. ఎన్నికలై నాలుగు సంవత్సరాలు దాటిన ఇంతవరకు అమలు ఊసే లేదన్నారు. ప్రభుత్వాలు స్పందించి ఇల్ల స్థలాలు లేని వారికి స్థలాలను, స్థలాలు ఉన్నవారికి ఇండ్లు నిర్మించుకోవడం కోసం మూడు లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోడిరెక్క వెంకన్న, యాపేతు, ఏసు, వరిగల వినోదు, బంటు ఎల్లయ్య, నాగేశ్వరరావు, పాపయ్య, లక్ష్మమ్మ, సావిత్ర, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.